20, ఫిబ్రవరి 2012, సోమవారం

కథా విశ్లేషణ పోటీలో బహుమతి కి నా స్పందన.

కథా జగత్ .. వారికి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ విహారి గారికి,కస్తూరి మురళీ కృష్ణ గారికి మనః పూర్వకధన్యవాదములు.

దాదాపు రెండు వందల కథలలో పాఠకురాలిగా నేను అడుగుపెట్టడమే నాకు అసలైన బహుమతి. కథా విశ్లేషణలో పాల్గొనడం కూడా..

ఒక సామాన్య పాఠకురాలికి కథలు చదవడం పట్ల అనురక్తి మరియు కథలోని విషయం పట్ల, పాత్రల చిత్రీకరణ పట్ల సునిశిత పరిశీలనా..శక్తి తో పాటు ఆ పాత్రల స్వభావాన్ని అవగాహన చేసుకుని కథని విశ్లేషించుకుంటే.. మంచి కథ ఏదో మనకి తెలుస్తుందని నా అభిప్రాయం.

నేను అలాగే "సామాన్య" గారి "కల్పన" కథని చూసాను.

మంచి ఇతి వృత్తం తో పాటు కథా రచయిత కథని అందించడంలో యెంత వరకు కృతకృత్యులయ్యారో అన్నది కథ విజయానికి మూలకారణం అనుకుంటాను.

నా ఈ విశ్లేషణకి బహుమతి రావడం నాకు చాలా ఆనందదాయకం అనే కంటే.. "కల్పన" కథలోని స్త్రీ పాత్రల అంతరంగం,ఆలోచనల,ఆవేదనల ఉదృతిని అర్ధం చేసుకుని ఆ కోణంలో నేను చేసిన విశ్లేషణకి వచ్చిన బహుమతి అని నేను భావించడమైనది.

"సామాన్య"..గారు.. మరొకసారి మంచి కథని అందించిన మీకు అభినందనలు. అందరికి ధన్యవాదములు.

కథ జగత్ ని నిర్వహిస్తున్న మురళీ మోహన్ గారికి,కథా విశ్లేషణ కి బహుమతుల్ని అందించి ప్రోత్స హిస్తున్న చావా కిరణ్ కుమార్ గార్కి మనః పూర్వక ధన్యవాదములు.

లక్ష్మి మాధవ్ గార్కి,శైలజామిత్ర గారికి.. మనఃపూర్వక అభినందనలు.

కథా జగత్ లో పాల్గొన్న అందరికి కూడా అభినందనలు. ఇలాగే మంచి కథలని విశ్లేషించు కోవడానికి పోటీ పడదాం.

కథా జగత్ లో విహరిద్దాం.

23 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

congrats.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Congratulations "వనజవనమాలి" Gaaru..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా కుమార్ గారు.. మరి మరీ ధన్యవాదములు.

@ రాజీ.. మీకు కూడా మరి మరీ ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

abhinandanalandee...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much ..Rama krishna gaaru

జ్యోతిర్మయి చెప్పారు...

Congrats Vanaja garu..

రసజ్ఞ చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు వనజ గారూ!

కాయల నాగేంద్ర చెప్పారు...

వనజవనమాలి గారూ! మీ విశ్లేషణకు ప్రథమ బహుమతి వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

@};- వనజవనమాలి @};- గారు హృదయపూర్వక అభినందనలు అండి..<:-P

Unknown చెప్పారు...

అభినందనలండీ!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు ధన్యవాదములు.

@ రసజ్ఞ .. మరీ మరీ ధన్యవాదములు.

@ కాయల నాగేంద్ర గారు. మీ ముందస్తు విషెస్ నిజం అయ్యాయి. విశ్లేషణ ని బాగా గమనించారు కదండీ! మరీ మరీ ధన్యవాదములు.
@పురాణ పండ ఫణి గారు. . నా బ్లాగ్ కి స్వాగతం..అండీ! మీ అభినందనలకి ధన్యవాదములు.
@ బాలు. .. థాంక్ యు వేరి మచ్. మరి మరీ ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిట్టి-పండు.. మీ అభినందనలకి ధన్యవాదములు. నా బ్లాగ్ కి స్వాగతం.

సుభ /Subha చెప్పారు...

వనజ గారూ నేను మొట్టమొదట చూసింది రాజీ గారి బ్లాగులో.అక్కడ మీకింకా అభినందనలు చెప్పలేదు.ఎందుకో అక్కడ చూడండి.మరిక్కడ చెప్పనా వద్దా? చెప్పేయనా..సరెనండీ చెప్పేస్తున్నా... హృదయపూర్వక 'సుభా' కాంక్షలండీ.. చెప్పేసా..హ హ.. ఈ మాత్రం దానికి ఇంత చేయాలా అనుకోకండీ ప్లీజ్.ఏదో సరదాకి.. మీకు బహుమతి వచ్చిన ఆనందంలో..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుభ గారు .. కడలి తన అలలతో..ఉవ్వెత్తున ఎగసి వచ్చి..ఆనంద కెరటాలతో..అభినందనలు చెప్పి నందుకు.. చాలా ఆనందం. మీ అభినందనలకి.. సంతోషకరమైన మనఃపూర్వక ధన్యవాదములు.

Lasya Ramakrishna చెప్పారు...

అభినందనలు వనజ గారు...

అజ్ఞాత చెప్పారు...

Congratulations.ఇంతకంటే ఎక్కువ అక్షరాలున్న ఇంగ్లీషుమాట లేదని నా అభిప్రాయం. తెనుగులో శుభకామనలు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

లాస్య రామకృష్ణ గారు..మీ అభినందనలకి ధన్యవాదములు. నా బ్లాగ్ కి స్వాగతం అండీ!!!
@ కష్టే ఫలే గారు..ధన్యవాదములు,కృతజ్ఞతలు,

Kalasagar చెప్పారు...

Congrats Vanaja gaaru.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kala saagar gaaru..Thank you very much

సామాన్య చెప్పారు...

వనజ వనమాలి గారు
ముందుగా మీ విజయానికి హృదయపూర్వక అభినందనలు.
మీకిట్లా బహుమతి వచ్చిందని మా అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పారు.అనారోగ్యం చేత వెంటనే మీ ఆనందాన్ని పంచుకోలేక పోయాను.మీరిట్లాగే సీరియస్గా ఈ రంగంలోకి వచ్చి మంచి మంచి సాహితీ వ్యాసాలూ రాయాలని కోరుకుంటున్నాను .మీరు అందుకు సమర్ధులు కూడా.రాస్తూ వుండండి.మీకు మరో సారి అభినందనలు...నా సహచరుడు తెలుపమన్న అభినందనలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
అభిమానంతో..
సామాన్య&కిరణ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు & కిరణ్ గారు మీ ఇరువురుకి నా హృదయ పూర్వక ధన్యవాదములు. సామాన్య గారు.. మీ సృజించిన అంశాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. కవిత,కథ,సమీక్ష ఏదైనా సామాజిక సృహ తో.. చైతన్యవంతంగా.. రచనలు చేయడం మీ సునిశిత పరిశీలనకి , మీ స్పందనకి చక్కని తార్కాణం.

మీ రచనలు మరింతగా పాఠక లొకానికి చేరి క్రొంగొత్త ఆలోచనా ధోరణి లో సామాజిక సృహతో మెలిగేలా స్పూర్తివంతంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ..

మీరు త్వరగా ఆరోగ్యం చేకూర్చుకుని.. "అమయ" లో.. కనిపించాలని కోరుకుంటూ.. ధన్యవాదములతో..
వనజ వనమాలి.

హితైషి చెప్పారు...

vanaja garu.. churakatti padunuku sari ayina gurthinpu labhinchinanduku aanandamto... shubhaakaankshalu andisthoo..

hithaishi