వనజ వనమాలి

సోమవారం 28 మే 2012

చిత్రాలు చూడరా..!


జీవితం లో ఎదురైనా ప్రతి అనుభూతిని, అనుభవం ..ని బంధించి ..ఇలా..
చిత్రాలు చూడండి..














ఆదివారం 27 మే 2012

సరస్సు


నేను సరస్సుని

నేనొక
.. నిశ్చలమైన అందమైన సరస్సుని..
నింగినుండి కురిసిన చినుకులో చినుకునై ,
వరధనై..పరవళ్ళు..తొక్కాలని.. సందళ్ళు.చేయాలని.
నా..మది గదినిండా..ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..

మన్ను
మిన్నై నలుచెరుగులనుండి బాహుబందాలలో.. బంధించితే..
మరి నాకు ఏది గతి... ?
సఫలం కాలేని నా..కలలభారంతో ....విఫల మనస్కనై..
నే.. కార్చే.కన్నీరు నాలోనే ఇంకిపోయే నాకే సొంతమైన.. దుర్గతి
నాలో నేనే .. ఎన్నటికి నాలో నేనే..

నాలో
నన్నే అంటిపెట్టుకున్న జీవరాశులు ఎప్పటికి..
తల్లి.. గర్భం నుండి బయట పడని బిడ్డల్లా.
వాటి చిరుకధలికలకి.. ఎంతో..పులకింత
నా ఒడ్డున పెరిగే గడ్డిపూవును, చెట్టుమానును..
ఒకేలా.. ప్రేమ పంచేస్తూ..ఒకే పరికింత

దారినపోయే
కొంటెకోనంగి విసిరిన రాయితో..
అలజడి మొదలైతే కోపం ఇసుమంత

అద్దం
లాంటి మనసుతో..
అద్దంలా.. భాసించే నాలో.. నేను
తొంగి చూసుకుంటుంటే సంతసం మరింత..

దాహార్తి
తో .. వచ్చి దోసిళ్ళతో నింపుకుని తృప్తిపడి వెళుతుంటే..
తల్లినై.. స్తన్యాన్ని.. అందించిన సంతృప్తి కొండంత

నేను
నేనే.. ఎన్నటికి నేను నేనే!

(పత్రిక 2008 మార్చి సంచికలో ప్రచురింపబడ్డ కవిత)