7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

"సు" మన్




సుమన్ గారి  మరణవార్త నాకు చాలా చేదుగా అనిపించింది. విచారం ముంచుకొచ్చింది.

బుల్లి తెరపై తనదైన ఒక ముద్ర తో ప్రేక్షకులకి సన్నిహితుడు.

అన్నిటికి మించి.. మాకు సమీపంలో.. (పెనమలూరు) మాకు సురపరిచితమైన వాళ్ళు.

ఎక్కడో.. బీరకాయపీచు చుట్టరికం కూడా.

"నెమలికన్ను" బ్లాగ్ లో  సుమన్ కి శ్రద్దాంజలి చదివి నిర్ఘాంతపోయాను.

మేము చదివేది .. ఆంధ్రజ్యోతి పేపర్. అందులో ఒక్క ముక్క న్యూస్ కూడా లేకపోవడం వింతగా అనిపించింది.

మా ప్రక్కనే ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ..ఉంది. (ప్రియ ఫుడ్స్ ) ఆ  సంస్థకి సుమన్ గారు  ఎం .డి కూడా.

అయినా ఈ రోజు యదావిధిగా (విచిత్రంగా ) పని దినం జరిగింది.   సాయంత్రం  సంతాప సభ జరిగినట్లు విన్నాను .

ఒక  కళాకారుడు పైగా ఒక ప్రముఖుని   కుమారుడు ,ఒక సంస్థకి ఎం.డి.  వారి మరణం  పట్ల  వహించిన నిర్లక్ష్య వైఖరి చాలా బాధ కల్గించింది.

"కళంకిత  "  సీరియల్  లో  "సన్మతి నీయవే  భారతి సకల కళల హారతి" పాట గుర్తుకు వచ్చింది. ఎందుకీ కొందరు మనుషుల్లో.. అంతరాలు.!!?

 " సుమన్" గారికి శ్రద్దాంజలి.


1 కామెంట్‌:

సామాన్య చెప్పారు...

నేనూ ఆశ్చర్య పడ్డాను .పనిదినం ఎందుకంటె బహుసా సుమన్ సున్నిత మనస్కుడు కావడం కారణం కావచ్చేమో అనిపించింది .ఎవడిని వాడే మోసుకునే రోజులు కదా వనజ గారు ఇవి .