8, సెప్టెంబర్ 2011, గురువారం

ఆశలకి..

ఆశలకి... రెక్కలు ఉంటాయి కదా ! కొన్ని ఒంటరి ఆశలు,మరికొన్నిజంట ఆశలు,చాలా సామూహిక ఆశలు. ఆశ మనిషి శ్వాస. 

ఆశే లేకుంటే మనిషి మనుగడకి.. అర్ధం ఉండదేమో!

నిన్న ఒక జ్ఞాపకం,నేడు ఒక కల,రేపు అనేది ఆశ. మనిషి కి ఎన్నో..ఆశలు.  బహిర్గతం కాని ఆశలు ఎన్నో!  బహిర్గతం అయితే.. ఆకాశానికి..నిచ్చెనలు వస్తున్నాడని..యెగతాళి చేయరు.? రహస్య మైన ఆశలతో.. ఆశల పల్లకి..ఎక్కి..ప్రయాణం సాగిస్తారు. 

ఆసలు మనిషి జీవితమే.. ఆశల పల్లకి అట. కొందఱు..ఆ పల్లకి వెళుతుంటే..చూస్తూ..ఉండిపోతారట. మరి కొందరు ఆ పల్లకి మోసే బోయిలగా మిగిలిపోతారట. కొందఱు అదృష్ట వంతులు మాత్రం ఆ పల్లకి ఎక్కి కూర్చుని ప్రయాణించ గల్గుతారట. 

అసలు ఆశలు   పల్లకి ఎలా ఉంటుందంటారా? నేను చూసాను. ఇదిగో..ఇలా.


ఈ పల్లకిలో కూర్చోవాలని  ఎన్ని ఆశలు.. ముచ్చటగా ఉంది కదా ! 

సరే ఒక అమ్మాయి అయితే.. ఆకాశంలో..ఆశల హరివిల్లు.. ఆనందాలే పూచిన పొదరిల్లు.. అందమైన ఆ లోకం అందుకోనా..అంటుంది. ఆమెకి..ఎన్ని ఆశలో..కవి కలం కి నర్తించిన ఆమె ఆశలు..చూడండీ!



ఆశలకి.. ఆయుష్షు  ఉంటుంది. అస్పష్టమైన ఆలోచనలతో.. ఏవేవో.. కావాలని ఆశించడం.. ఆ ఆశలు నెరవేరక ఉసూరుమనడం.. ఈ సారి మెరుగైన ఆశలు పెట్టుకుని మెరుగైన ప్రయత్నాలు చేయాలని అనుకోవడం పరిపాటి.. "అంతా బ్రాంతి యేనా ఇక మిగిలేదింతేనా? ఆశా నిరాశేనా ?.. అంటూ.. విషాద గీతాలాపన చేసేవారికి.. ఓకే మాట.  నిరాశ అనే నేలమీద నిలబడ్డ మనిషికి..ఆశ అనే  ఆకాశ హర్మ్యం యెంత ఠీవిగా నిలబడి ఉంటుందో..చూడండీ.. అంటూ.."ఆశతో..జీవించడంలోనే అందమెంతో ఉందిలే"..అనే వేదవతి ప్రభాకర్ గారి "నవ్వుతూ బ్రతకాలిరా" గుర్తు చేస్తూ..ఉండటమే!



ఆశలకి రెక్కలుంటాయి.మితిమీరి ఎగరాలనుకుంటే రెక్కలు విరిగిన విహంగంలా..నేల కూలాల్సిందే.
అందుకే హద్డు ఎరిగి బుద్ది పెంచుకుని ఆశలు పెంచుకుంటే..బాగుంటుంది..అని చెపితే వింటారా? 


"కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం..అని ఆశ పడుతున్నారు..ఈ గుంపు మిత్రులు.. ఒకసారి విషయంలోనుండి అటువైపు దూకి..చూసొద్దాం రండీ..


బాబోయి.. ఇన్ని ఆశలా? అనుకోకండి.. అందులో..సగమైనా తీరాలని..నా ఆశ కూడా.. 
ఈ ఆశలకి అంతే లేదా.. ? 

ఆశలు ఉంటాయి అందరికి అవి ..కొందరికి అనుకుంటాను.కానీ.. "ఆశలకి కన్నీళ్లు ఉంటాయి" అని ఒక సరి క్రొత్త కోణం..వచ్చింది.మీకు తెలిస్తే అది..మీరు చెప్పండి.


ఇంతకీ..నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. ఆశను బ్రతికించి.. తాను మరణించేవాడు మనిషి.

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

నిజమే ఆశ లేని వాడు ఉండడేమో! చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.

తెలుగు పాటలు చెప్పారు...

వనజ గారు మీ పోస్ట్ బాగుంది అండి, కలాం గారు అన్నట్లు కలలు కనండి వాటిని సార్ధకం చేసుకోండి.. కలలు మన వయసు బట్టి మారుతూ వుంటాయి, ఇలా చెప్పుతున్న అని ఏమి అనుకోకండి నాకు చిన్నప్పుడు ఒక కల కనేవాన్ని.. పెళ్లి చేసుకోవాలి పెళ్ళికి కట్నంగా ఒక గుర్రం కావాలి అని అడగాలి అని ఉంది( ఏది పెళ్లిల్లో బైక్ పెడుతున్నారు కదా ) అది తెలిసి తెలియని వయసు అప్పుడు అల కల కనేవాడిని కానీ ఇప్పుడు అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను.. ఇప్పుడు బాగా సంపాదించాలి మచి ప్లేస్ కి రావాలి పెళ్లి చేసుకోవాలి మచిగా హ్యాపీ గా బ్రతకాలి అని ఉంది, కట్నం అడగటం మహా పాపం మా చెల్లికి పెళ్లి జరిగినప్పుడు తెలిసింది.. వయసు పెరుగుతున్న కొలది ఆశల తిరు మారుతుంది.. రజినీకాంత్ గారి డైలాగ్ (అతిగా ఆశపడే మొగాడు అతిగా ఆవేశ పడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు ) ఇతను సినిమా బాగా హిట్ కావాలి బాగా డబ్బురవాలి అని ఆశతోనే సినిమా తీశాడు కదా....ఇది ఎంత వరకు నిజం , కానీ మనిషి ఆశలేకుంట ఏమి జరగదు చేసే ప్రతిపని ఆశతోనే చేస్తాడు.. ఆశకి కన్నీరు.... ప్రతి ఆశకు కన్నీరు వుంటాయి అది సాధించాక ఆనందభాష్పాలు, సాధించలేకపోతే ఫెయిల్ అని దుఖం తో కన్నీరు.. అందుకే మన పెద్దలు అన్నారు నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి అని.. కానీ మనం చేసే ఈ పనిలో ఐనా ఆశ ఉండాలి, ఆశతో పాటు నిజాయతి ఉండాలి, చాల మంది జాబ్స్ చేస్తారు
అందులో కొంతమంది నీ చేసే పనిని ప్రేమతో చేస్తారు, కొంత మంది మనకు ఏమి వస్తుంది అనుకోని చేస్తారు, నేను అలా చాలామంది ని చూశా, వీళ్ళకి ఈ పాటికి వాచ్మ తిన్నామా పోయామా అనే తప్ప ఇంకో ఆలోచన లేదు.. వీరు బాగుపడరు పక్కన ఉన్నవారిని చెదకోడతారు హ్హ హ్హ కానీ ఆశనే మనిషని బ్రతికిస్తుంది ముందుకు పోనీస్తుంది ఆ ఆశే కన్నిరుకుడా ఇస్తుంది